ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లుక్ విడుదలైంది. కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. షూటింగ్ స్పాట్ నుంచి ఫోటో ఒకటి నెట్లింట్లో ఇప్పుడు సందడి చేస్తుంది. నక్సలైట్ గెటప్‌లో మెడలో ఎర్ర కండువా వేసుకుని నిల్చున్న మెగాస్టార్ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా చిరు లుక్ అదిరిపోయింది. 20 ఏళ్ల కింద చిరంజీవి ఎలా ఉన్నాడో.. ఈ సినిమా కోసం అలా
సైరా కోసం అప్పట్లో కాస్త బరువు పెరిగినట్లు కనిపించిన చిరు.. ఇప్పుడు మళ్లీ కొరటాల కోసం బరువు తగ్గిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. రంగస్థలం షూటింగ్ చేసిన సెట్లోనే భారీ సెట్ వేసారు ఈ చిత్రం కోసం. అక్కడే 50 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసాడు దర్శకుడు కొరటాల.
నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రం వస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడు లీక్ అయిన ఫోటో చూస్తుంటే అది నిజమే అని కన్ఫర్మ్ అయిపోతుంది. రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఎప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇదే ఏడాది దసరా కానుకగా చిరంజీవి సినిమా విడుదల కానుంది. దీనికి ఆచార్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఏదేమైనా చిరంజీవి లుక్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది.