Tuesday, March 2, 2021

Latest Posts

హైదరాబాద్ లో చక్కర్లు కొట్టిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో!!

leopard found near KBR park in hyderabad

లాక్ డౌన్ వేళ  హైదరాబాద్ రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. అయితే పగటి వేళల్లో కొంత జనసంచారం ఉన్నప్పటికీ… రాత్రి సమయాల్లో ఎవరు  రోడ్లపై  కనిపించడం లేదు. అలాగే రవాణా వ్యవస్థ కూడా ఆగిపోవటం తో రోడ్లన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి.  ఈ  నేపథ్యంలో, జంతువులు, పక్షులు రోడ్లపై స్వేచ్ఛగా సంచరిస్తూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి లో జింకలు, నెమళ్లు మరియు ఇతర జంతువులు రోడ్ల పై విహరిస్తుండగా  ఇప్పుడు ఈ జాబితా లో హైదరాబాద్ చేరింది. వివరాల్లోకి వెళ్తే… బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కు ఆనుకుని ఉన్న కేబీఆర్ పార్కు వద్ద ఎన్నడూ లేని విధం గా  ఒక చిరుత సంచారం అందరినీ షాక్ గురి చేస్తుంది. ప్రముఖ నిర్మాత అయిన అభిషేక్ ఆగర్వాల్  చిరుత సంచరిస్తున్న ఈ  వీడియొ ని తన కెమెరా లో భందించి తన ట్విటర్ లో షేర్ చేయటం తో ఈ వీడియొ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే  ఇది ఏప్రిల్ 18  తెల్లవారుజామున తీసిన వీడియొ అని ట్వీట్ చేయటం జరిగింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss