హైదరాబాద్ గగంపాడు రైల్వే బ్రిడ్జ్ కింద హైవే మీద కనిపించి ఒక లారీ డ్రైవర్ మీద దాడి చేసి పారిపోయిన చిరుత తరువాత మళ్ళీ ఎక్కడ ఉందో ఆచూకీ దొరకలేదు, కాగా ఇప్పుడు మళ్ళీ గన్ పహాడ్ వద్ద ప్రత్యక్షమై మరో లారీ డ్రైవర్ పై దాడి చేసి పారిపోయింది. కాగా ఈ ధృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కామెరాలలో రికార్డు చేయబడ్డాయి.
చాలా సేపు రోడ్డు మీదే ఉంది పారిపోయిన చిరుత పులి పారిపోతు అక్కడ లారీ డ్రైవర్ పై దాడి చేసి చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్ళినట్టు తెలుస్తుంది. కాగా ఆ ప్రాంతంలో అక్కడక్కడా బోనులు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అదికారులు. నిన్న గగంపాడులో సంచరించిన చిరుత పులి అగ్రికల్చర్ యునివర్సిటీ అడవుల మీదుగా హిమాయత్ సాగర్ వెళ్ళినట్టుగా గుర్తించారు. అక్కడ కూడా బోనులు ఏర్పాటు చేసిన అధికారులు తీవ్రంగా శ్రమించినా దొరకని చిరుత ప్రస్తుతం తప్పించుకుని చిలుకూరు అడవులు వైపు పారిపోయినట్టు అటవీ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: లాక్ డౌన్ సమయంలో విమాన ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా?