వారం రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారులో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి కాటేదాన్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి దగ్గర గాయాలతో ఓ చిరుత కనిపించడంతో ఓ లారీ డ్రైవర్ దానిని గమనించి దగ్గరకు వెళ్ళి చూడగా అతన్ని గాయపరిచి,రోడ్డు పక్కనే ఉన్న ఫామ్ హౌస్‌లోకి వెళ్లిన చిరుత అక్కడి నుంచి కూడా తప్పించుకొని వ్యవసాయ విశ్వ విద్యాలయం యూనివర్శిటీలోని దట్టమైన పొదల్లోకి వెళ్లిపోయింది. తర్వాత రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకోవడానికి చాలా సేపు ప్రయతించిన దాని జాడ దొరకలేదు. ఆ రోజు నుంచి దాని కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తూనే ఉన్నారు.
అయితే ఈ రోజు ఉదయం చిరుత రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని హిమాయత్ సాగర్ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లో ప్రత్యక్షం అయ్యింది. చిరుత స్విమ్మింగ్ ఫూల్లో నీళ్లు తాగుతుండగా ఆ గార్డెన్ వాచ్ మెన్ గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన అధికారులు చిరుతను బంధించేందుకు ఆ గార్డెన్‌లోకి కుక్కలను వదిలి రెండు బోనులను కూడా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: తోడికోడలు వేధింపులకు తల్లి తన ఇద్దరు పిల్లలు బలి