Monday, July 26, 2021

Latest Posts

విజయ్ దేవరకొండ లైగర్ కి ఓటిటీ సంస్థ బంపర్ ఆఫర్

Liger Movie Got Bumper Offer

లాక్ డౌన్ కారణంగా విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ యొక్క లైగర్ కొంతకాలంగా నిర్మాణంలో ఉండిపోయింది. కానీ అది సినిమా యొక్క హైప్‌ను ఏ మాత్రం తగ్గించలేదు. ఇది విజయ్ యొక్క తొలి పాన్-ఇండియా చిత్రం. ఈ చిత్రం కోసం అభిమానులు మరియు విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఒక పాపులర్ ఓటిటీ సంస్థ ఈ సినిమా ఒప్పందం కోసం మంచి ఆఫర్ ని తీసుకువచ్చిందట. ఈ చిత్రం అన్ని భాషలలోని శాటిలైట్ హక్కులతో కూడిన ప్రత్యక్ష ఓటిటీ విడుదలకు 200 కోట్ల సంచలనాత్మక ఆఫర్‌ను ఇచ్చారట. దీనితో చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ఎక్కడ రిలీజ్ చెయ్యాలి అనే సందిగ్ధంలో పడినట్లు తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ, పురి జగన్నాధ్ యొక్క క్రేజీ స్టైల్ మేకింగ్ మరియు ఇస్మార్ట్ శంకర్ తో పూరి విజయం, విజయ్ కి బాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ తో ఈ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss