Tuesday, May 18, 2021

Latest Posts

ఏపీలో మాస్క్, గొడుగు, ఆధార్ కార్డు ఉంటేనే మద్యం…

Liquor in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం సూచనలు మేరకు మద్యం అమ్మకలకు శ్రీకారం చుట్టింది . లాక్‌డౌన్ నిబంధనల కారణంగా నలబై రోజులకు పైగా మద్యానికి దూరంగా ఉన్న మందుబాబులు వైన్ షాపులు తెరవడంతో  ఒక్కసారిగా  వైన్స్ మీద పడిపోయారు. ఈ తరుణంలోనే మద్యం షాపులు తెరుచుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రతిచోట మద్యం ప్రియులు  మందు షాపుల ముందువాలిపోయారు. ఏ మద్యం షాప్ దగ్గర చూసినా బారులు తీరిన మందుబాబులే కనిపించగా ఏపీలో ప్రతి చోట ఇటువంటి పరిస్థితి నెలకొంది . మండుటెండలను సైతం లెక్కచేయకుండా మందుబాబులు షాప్ ల  ముందు బారీ క్యూ లైన్లలో నిలబడ్డారు.

కానీ ప్రతి వ్యక్తి మద్య కనీసం 5అడుగులు దూరం  పాటించకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.అయితే ఈ నేపథ్యంలో ఏపీలోని తెనాలి సీఐ హరికృష్ణ మందుబాబులకు కొత్త నిబంధనలు పెట్టారు. ఆధార్ కార్డు, గొడుగు ఉంటేనే మద్యం అమ్ముతారంటూ స్పష్టం చేశారు. ఒకరి నుంచి మరొకరు ఎడంగా ఉండాలంటే గొడుగు అడ్డుగా ఉంటుందని దానికి తోడు ఎండ బారి నుంచి రక్షణగా ఉంటుందని తెలిపారు. ఇదేకాక ఇతర ప్రాంతాల నుంచి మద్యం కోసం వస్తుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతుందని వారిని కనుగొనేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. అలాగే మాస్క్ కూడా తప్పన సరిగా  ఉండాలని నిబంధనలు విధించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss