Home రాజకీయం ఏపీలో మరో 50శాతం పెరగనున్న మద్యం ధరలు-షాక్ లో మద్యం ప్రియులు

ఏపీలో మరో 50శాతం పెరగనున్న మద్యం ధరలు-షాక్ లో మద్యం ప్రియులు

Alcohol Prices In AP

Liquor Rates In AP

ఏపీలో నిన్న జరిగిన పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఏపీలో మద్యం ధరలు మరో మారు పెంచనునట్లు తెలుస్తుంది. లాక్ డౌన్ పొడిగుంపు దృష్ట్యా కొన్ని సడలింపులతో మద్యం దుకాణాలను ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దాంతో దేశంలో ని చాలా రాష్ట్రాలలో మద్యం షాపులు తెరిచారు. దీంతో   మందుబాబులకు కాస్త ఊరట పొందారు అనుకున్న తరుణమలో ఏ.పీ ప్రభుత్వం వారికి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది.

ఇప్పటికే మద్యం రేట్లను 25శాతం పెంచిన ఏ పీ ప్రభుత్వం మరోమారు భారీగా మద్యం ధరలను పెంచబోతోంది. ఈ సారి ఏకంగా 50శాతం ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న (మే 4న) పెంచిన 25శాతంతో మరో 50శాతం కలిపి 75శాతం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్న మందుబాబులు ఒక్కసారిగా షాపులపై ఎగబడటంతో వారిని కట్టడి చేయడంలో అధికారులు ఇటు ప్రభుత్వం విఫలం అయ్యాయి. దాంతో అధిక  ధరలు పెంచితే కొంత  మెరకైనా కట్టడి చెయ్యొచని అధికారులు మొగ్గు చూపిస్తున్నారు అని తెలుస్తుంది.

Exit mobile version