Wednesday, April 21, 2021

Latest Posts

రోజు రోజుకు మత్తెక్కిస్తున్న మద్యం అమ్మకాలు..!!

లాక్‌ డౌన్‌ ప్రభావం తో  దాదాపు గా  నెలన్నర రోజులు మూత పడ్డ మద్యం షాపులు తిరిగి తెరవడంతో మద్యం అమ్మకాల కలెక్షన్ లు  రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచి ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి కావస్తుండగా… ఈ నాలుగు రోజుల్లో ఏకంగా రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లుగా లెక్కలు ద్వారా స్పష్టం అవుతుంది. ఇకపోతే శనివారం ఒక్కరోజే మద్యం డిపోల నుంచి రూ.149 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అంచనా.  

గత నాలుగు రోజుల్లో మే 6న రూ.72.5 కోట్లు, మే 7వ తేదీన ఇంకా ఎక్కువగా 188.2 కోట్లు, మే 8న డిపోల నుంచి రూ. 190.47 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైన్స్ షాపులు తిరిగి ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే తెలంగాణలో మద్యం అమ్మకాలు రూ.600 కోట్లకు చేరుకున్నాయి.

ఇకపోతే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు ప్రభుత్వం అంతగా పెంచకపోవడం కూడా అమ్మకాలకు పెరగటానికి కారణమని చెప్పవచ్చు. ఇక ఏపీలో మద్యం ధరలను 75 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అదే తెలంగాణలో మాత్రం మద్యం ధరల పెంపు చీప్ లిక్కర్‌పై 11 శాతం.. ఖరీదైన మద్యం పై 16 శాతం గా  పెంచటం జరిగింది.

ఇది కూడా చదవండి: మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss