Wednesday, April 21, 2021

Latest Posts

కరోనా కాదు చంద్రబాబు ఎఫెక్ట్ తోనే వాయిదా అట

localbody elections postponed with Chandrababu effect says kannababu:

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక కోవిడ్‌ ఎఫెక్ట్‌ కారణం కాదు, చంద్రబాబు ఎఫెక్ట్‌ వల్లే వాయిదా వేసారట. ఈమాటలు అన్నది సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఆరు వారాల పాటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అభివృద్ధి, సంక్షేమం, పాలన ఆగిపోతాయి.  ఎన్నికల కమిషనర్‌పై ఈగ వాలకుండా చంద్రబాబు, వాళ్ల మీడియా చూసుకుంటున్నారు’అని వ్యాఖ్యానించారు.

కాగా రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్‌  గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంటే విపక్షాలకు భయమెందుకని  ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భేషజాలకు పోకుండా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరించాలని కోరారు.

కరోనా సాకుతో స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భేషజాలకు పోవద్దని మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోరారు. అందరూ ఎన్నికలకు సన్నద్ధమై ఉన్న తరుణంలో వాయిదా నిర్ణయం సరైనది కాదన్నారు. ఎన్నికల కమిషనర్‌ తన పరిధిని అతిక్రమించి, ఇతర రాజ్యాంగ సంస్థల హక్కులను కాలరాయటం సమంజసం కాదన్నారు.రమేష్‌కుమార్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ, యంత్రాంగాన్ని గానీ సంప్రదించి సలహాలు తీసుకున్నట్లు ఎక్కడా లేదని,  ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదని అన్నారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేశామని చెబుతున్నార ని, ప్రభుత్వ శాఖలు చేపడుతున్న కరోనా నివారణ చర్యలు బహుశా కమిషనర్‌ రమేష్‌కుమార్‌ చూశారో లేదోనని, మార్చి 10న విద్యాశాఖ కరోనాపై సమీక్షించి నివారణకు మార్గదర్శకాలిచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss