తెలంగాణలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఈ నెల 29 వరకూ విధించిన లాక్ డౌన్ ను కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నెల 31 వరకూ పెంచుతున్నట్లు వెల్లడించారు. కాగా కొన్ని సడలింపులతో లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నట్లు కేసిఆర్ తెలిపారు. సడలింపులలో భాగంగా తెలంగాణలో తెరుచుకోనున్న షాపులు. కంటోన్మెంట్ ఏరియాలలో తప్ప మిగిలిన అన్నీ షాప్‌లకు సరి బేసి పద్దతిలో అనుమతిస్తున్నట్లు కంటోన్మెంట్ ఏరియాల్లో ఎవ్వరూ బయటకు రాకూడదు, వారికి కావలసిన నిత్య అవసర సరుకులు వారి ఇంటి వద్దకే సరఫరా చేయబడతాయి అని స్పష్టం చేశారు.
రేపటినుండి తెలంగాణలోని అన్నీ జిల్లాలో ఆర్టిసి బస్సులకు అనుమతి లభించిన, సిటిలోని సిటీ బసులకు మాత్రం అనుమతి లేదు. అలాగే ఇతర రాష్ట్రాలనుండి బస్సులు రావడానికి గాని పోవడానికి గాని అనుమతి నిరాకరణ. ఆటొలో డ్రైవర్ కాకుండా ఇద్దరకు, టాక్సీలలో డ్రైవరు కాకుండా ముగ్గురుకు మాత్రమే అనుమతి లభించింది. మెట్రో ట్రైన్లు కూడా నడవవని స్పష్టంగా తెలిపారు. అలాగే కర్ఫ్యు సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు యధాతదంగా కొనసాగుతున్నట్లు సిఎం తెలిపారు. మాస్క్ తప్పని సరిగా ధరించాలి, ఒకవేళ మాస్క్ లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానా అని తెలిపారు. అన్నీ రకాల పరిశ్రమలకు కొన్ని సడలింపులతో అనుమతి లభించింది. ఇ కామర్స్, సాలూన్ షాపులను కూడా తెరుచు కోవచ్చని తెలిపారు. ఫంక్షన్ హాల్లు, పబ్బులు, బార్లు , విద్యా సంస్థలు, స్టూడియోలకు, స్వీమింగ్ ఫూల్స్, పార్కులకు, సినిమా హాల్లు, అన్ని ప్రార్ధనా మందిరాలకు మాత్రం అనుమతి నిరాకరించారు.
ఇది కూడా చదవండి: ఆంఫన్ తుఫాను నుండి అందరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా – మోదీ