కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. తాజాగా కరోనా కొత్త స్ట్రెయిన్ గా తన రూపాన్ని మార్చుకొని మరీ ప్రజల్ని వణికిస్తున్నాయి. యూకేలో మొదలైన ఈ కొత్త వైరస్ ఆ దేశ వాసుల్ని వణికిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అంతకంతకూ వ్యాపిస్తూ ఆ దేశానికి ముచ్చెమటలు పట్టిస్తుంది. చివరకు దీని దెబ్బకు ఠారెత్తిపోయిన అగ్రరాజ్యం.. మరోసారి దేశ వ్యాప్తంగా కఠిన లాక్ డౌన్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా కఠినమైన నిబంధనల్ని తెర మీదకు తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంతో అవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని.. ఇంటికే పరిమితం కావాలని కఠిన ఆంక్షల్ని తీసుకొచ్చారు. కేవలం ఆసుపత్రులు.. సూపర్ మార్కెట్లు.. మందుల దుకాణాలు.. పోస్టాఫీసులు లాంటి అత్యవసర సర్వీసుల్ని మాత్రమే తెరిచి ఉంచుతున్నట్టు తెలిపారు.
ఒకవేళ ఎవరైనా లాక్ డౌన్ నిబంధనల్ని అతిక్రమిస్తే రూ.20వేల జరిమానా విధించబోతున్నట్టు తెలిపారు. ఎక్కువసార్లు నిబంధనల్ని అతిక్రమిస్తే రూ.6.36 లక్షల ఫైన్ వరకు వేసే వీలుంది అని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆరు వారాల పాటు లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి: