Thursday, May 13, 2021

Latest Posts

తెలంగాణలో సడలించిన లాక్ డౌన్ మార్గదర్శకాలు

సి‌ఎం కే‌సి‌ఆర్ పెద్దగా మార్పులు చేయకుండా లాక్ డౌన్ ను అమలు చెయ్యల్సిందేనని తెలియచేసారు. కాగా కొన్ని నిబందనలను మాత్రం ఈ రోజు సడలించినట్టు తెలియచేసారు. వీటిలో భాగంగా ఏ‌సి విక్రయ దుకాణాలు, ఆటొ మొబైల్ షో రూమ్ లు, ఆటొ మొబైల్ వీడి భాగాల విక్రయ దుకాణాలకు అనుమతులు మంజూరు చేయడమైనది. కాగా రేపటితో ముగియనున్న దేశవ్యాప్త 3 వ లోక్ డౌన్ పీరియడ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సి‌ఎం కే‌సి‌ఆర్ తెలియచేసారు.

ఎల్‌బి నగర్, మలక్ పేట, ఛార్మినార్ ప్రాంతాలో ఎక్కువ కరోనా కేసుల నమోదు కాగా ఈ ప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రాంతాలలో కొద్దిగా సరలించిన విధానాలను ముఖ్య మంత్రి కే‌సి‌ఆర్ ఉన్నత స్థాయి సమావేశం తర్వాత చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆటొ మొబైల్ దుకాణాలు, వీడి భాగాల దుకాణాలు, ఏ‌సి దుకాణాలుతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టి‌ఏ కార్యాలయాలు, రెజిష్ట్రేషన్ కార్యాలయాలు కొనసాగుతాయని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: 50 కోట్లు డిపాజిట్‌ చేసిన ఎల్‌జి పాలిమర్స్‌

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss