Sunday, February 28, 2021

Latest Posts

అవి కూడా రద్దుచేస్తారా – రెచ్చిపోయిన చినబాబు

శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయం తో అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి – మాజీ మంత్రి నారా లోకేశ్ కి తగిలింది. రద్దు నిర్ణయంతో, ఇక కేంద్రం ఆమోదిస్తే, మండలిలో సభ్యుడిగా ఉన్న లోకేశ్ కు ఎమ్మెల్సీ పదవి ఒక్క దెబ్బకు పోతుంది. నిజానికి అసెంబ్లీలోకి అడుగుపెట్టే యోగం ఇప్పటిదాకా లోకేశ్ కు దక్కలేదు. మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలోకి దిగిన లోకేశ్ ను వైసీపీ చిత్తుగా ఓడించింది. నిజానికి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేదని ముందే తెలుసన్నట్లు చంద్రబాబు దొడ్డిదారిన మండలికి లోకేష్ ని ఎంపిక చేశారన్న ఆరోపణలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అశనిపాతమైంది.

అసెంబ్లీలో మండలిని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించడంతో తన ట్విట్టర్ ఖాతా వేదికగా లోకేశ్ ఓ రేంజిలో రెచ్చిపోయాడు. 38 బిల్లులు మండలికి వస్తే వాటిలో కేవలం రెండు బిల్లులకు సవరణలు ప్రతిపాదిస్తూ పంపామని, అదే సమయంలో మరో రెండు బిల్లులను మాత్రమే తిరస్కరించామని లోకేశ్ చెబితూ,ఈ మాత్రానికే మండలిని రద్దు చేస్తారా? అంటూ నిలదీసాడు. తక్షణమే జగన్ కేబినెట్ లోని ఇద్దరు ఎమ్మెల్సీలతో మంత్రి పదవులకు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీకి ఉన్న మరో ఏడుగురితోఅదేవిధంగా ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలతోనూ రాజీనామాలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

రెండు బిల్లులను తిరస్కరించిన మండలిని రద్దు చేసిన జగన్… తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేదని కోర్టులను కూడా రద్దు చేస్తారా? అని లోకేష్ అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం తాను కోర్టుకు హాజరు కావాల్సిన దుస్థితిపై మదనపడుతున్న జగన్.. మండలి మాదిరే ఏకంగా శుక్రవారాన్నే రద్దు చేసేస్తారా? తనను కోర్టు ముందు నిలబెడుతున్న శుక్రవారాన్ని రద్దు చేసేసి… ఏడు రోజుల వారాన్ని ఆరు రోజుల వారంగా మార్చేస్తారా? అని విరుచుకు పడ్డారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss