Sunday, June 20, 2021

Latest Posts

నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ కి కష్టాలు తప్పవా!

Love Story Release Date In Dilemma

శేఖర్ కమ్ముల యొక్క “లవ్ స్టోరీ” ఏప్రిల్ మూడవ వారం నుండి తప్పుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 16 న తెరపైకి రానుంది. అయితే ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంకు వాయిదా పడుతుందని చర్చ.

కానీ మేకర్స్ దీనిని ఖండించారు. విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదని నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 9 న విడుదలవుతున్న పవన్ కళ్యాణ్ యొక్క “వకీల్ సాబ్” చిత్రం వల్ల ఈ సినిమాకు ఎఫెక్ట్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. వకీల్ సాబ్ సినిమా ఎక్కువ స్క్రీన్స్ తో మొదటి వారం విడుదల కానుంది. మొదటి వారం తర్వాత సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్‌గా మారితే, నిర్మాత దిల్ రాజు రెండో వారం కూడా అదే థియేటర్లను కొనసాగిస్తారు.

అలాంటప్పుడు, ఇది శేఖర్ కమ్ముల యొక్క “లవ్ స్టోరీ” ఓపెనింగ్స్ ని దెబ్బ తీసే అవకాశముంది. కానీ “లవ్ స్టోరీ” నిర్మాతలు తమ సినిమా అలాంటి సమస్యలను ఎదుర్కోదని నమ్మకంగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో మనం ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss