Friday, January 22, 2021

Latest Posts

పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడిని కసితీరా!

తాళ్లపూడి మండలంలోని మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తాతాజీ పెళ్ళికి నిరాకరిస్తున్నాడని నడిరోడ్డుపైన కత్తితో కసితీరా పొడిచి చంపిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో వెలుగులోకి వచ్చింది.

ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నా తాతాజీ ఒప్పుకోవడం లేదు. దీనితో ప్రియురాలి కి కోపం వచ్చి ఇలా చేసింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం జరిగింది, తాతాజీ బైక్‌పై పంగిడి వచ్చాడు. అక్కడ పావని అతడిని కలిసింది. రాత్రి వరకు ఇద్దరూ అక్కడే తిరిగిన అనంతరం బైక్‌పై మలకపల్లి బయలుదేరారు.

బైక్ పై కూర్చున్న పావని తనను పెళ్లి చేసుకోవడం లేదని కసి పెంచుకున్న నేపథ్యంలో బ్యాగ్ లో కత్తి పెట్టుకుని వచ్చింది. బైక్ పై వెళ్తుండగానే తాతాజీని కసితీర మెడ, తల, వీపుపైనా కత్తితో  దాడిచేసింది. తీవ్ర గాయాలపాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss