Monday, May 10, 2021

Latest Posts

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ప్రతీ నెల ధరలలో మార్పు..!!

LPG Gas cylinder Price Massively reduced

గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గించటం తో  గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వారికి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.214 తగ్గించగా.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) ధర రూ.336 క్షీణించింది. ఇక ఈ కొత్త రేట్లు మే1 నుంచే అమలులోకి వచ్చాయి.

తాజా ధరల తగ్గింపు నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్ (14 కేజీలు) రూ.583 నుంచి ప్రారంభమౌతోంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.988 నుంచి ఆరంభమౌతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్ సిలిండర్ ధర కూడా దిగొచ్చింది.  

ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా పెట్రోల్, డీజిల్ ధరల మాదిరిగానే  మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. అందుకే గ్యాస్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను మారుస్తుంటాయి. దీని కారణం గా ధర తగ్గొచ్చు, పెరగొచ్చు, లేదంటే అలాగే కూడా ఉండొచ్చు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss