Madhavi latha Sensational Comments on BJP internal issues :
భారతీయ పార్టీలో అంతర్గత కొట్లాట మొదలయ్యిందా? క్యాడర్ని ఒక తాటి పై తీసుకొచ్చి ఎన్నికల బరిలో నిలవాలని ముందుకు వెళ్తున్న BJP కి అంతర్గత కొట్లాటలు కొంత ఆందోళన కలిగిస్తుంది. సినీ నటి మాదవి లత BJP పార్టీ లో కార్యకర్తగా పనిచేస్తున్న ఈమె తాజాగా, BJP అధిష్టానాన్ని ప్రశ్నించారు. పచ్చ కండువాలు కప్పుకున్నంత కాలం బిజెపి ని అమ్మ నా బూతులు తిట్టి ప్రధాని ని తిట్టి , అధ్యక్షుడిని తిట్టి ఇపుడు అధికారం లో లేని కారణంగా దేశం లో అధికారం లోకి వచ్చిన పార్టీ కనుక ఇపుడు అందరికి ఇదే దొరికిందే సందుగా కాషాయం కప్పుకున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాష్ట్ర కమిటీ ఏర్పాటు అవ్వలేదు , పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి విలువ ఇవ్వరు పచ్చ కండువా కప్పుకుని మల్లెపూల వాసన సువాసన గురించి మాట్లాడిన వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఎం చేసారని ఇచ్చారు? మల్లెల మరపు మెరుపు నలిపిన కథలు చెప్పారు కనుక?? లేదా అధికారం లో ఉన్నపుడు అదుపు తప్పి మాట్లాడారనా? పార్టీని పనికిమాలిన తిట్లు తిడితేనే అధికారం ఇస్తారని నాకు తెలిసి ఉంటె నేను కూడా పక్క పార్టీ కండువా మార్చుకునేదాన్ని. పచ్చ కండువాలు కప్పుకుని వచ్చిన వారికే ఇక్కడ విలువ గౌరవం కస్టపడి పనిచేసేవాళ్ళకి గౌరవాలు ఉండవు. ఇది నిజం ఇదే నిజం ఎవరు ఖండించిన సరే నిజాన్ని దైర్యంగా చెప్పే దమ్ము నాకుంది. ఎవరు అడ్డొచ్చిన ఎదుర్కొనే సత్తా ఉంది” అని అన్నారు.