Monday, April 19, 2021

Latest Posts

మధ్యప్రదేశ్ సిఎం కమల్ నాథ్ రాజీనామా

Madhya Pradesh CM Kamal Nath Resigned Before Floor Test:

ఆఖరి వరకూ తన పదవికేం కాదని చెప్పుకొచ్చిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చివరకు తన పదవికి రాజీనామా చేశారు. అక్కడ శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం అసెంబ్లీలో బలపరీక్షకు కొద్ది గంటల ముందే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. 22 మంది కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించడం, బలపరీక్షలో ఓటమి త ప్పదనే విషయం స్పష్టం కావడంతో కమల్‌నాథ్‌ మధ్యా హ్నం ఒంటి గంట సమయంలోనే గవర్నర్‌ లాల్జీ టాండన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు.

మధ్యప్రదేశ్అసెంబ్లీలో మొత్తం 230 మంది సభ్యులలో ఇద్దరు సభ్యులు చనిపోవడం, 22 మంది రాజీనామా చేయడంతో అధికారం నిలబెట్టుకునేందుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 104గా మారింది. కానీ, కాంగ్రెస్‌ బలం 92కు పడిపోవడంతో కమల్‌నాథ్‌కు రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్లు రాజ్‌భవన్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా కమల్‌నాథ్‌కు గవర్నర్‌ సూచించారు.

మొత్తానికి కేవలం 15నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో మధ్యప్రదేశ్ లో గత 18 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనా డూ బేరసారాలకు పాల్పడలేదని అంతకుముందు కమల్‌నాథ్‌ మీడియాతో అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ప్రభుత్వా న్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజలు తిరస్కరించిన, అధికార దాహం కలిగిన ఓ వ్యక్తి, అత్యాశపరులైన ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి కుట్ర పన్నారని కాంగ్రెస్ నుంచి వైదొలగి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాపై కమలనాధ్ పరోక్షంగా విమర్శలు కురిపించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss