Thursday, May 13, 2021

Latest Posts

లస్ట్ స్టోరీస్ టాస్క్ లో మహానటి డైరెక్టర్ చేరాడా?

అవుననే అంటున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన ‘లస్ట్ స్టోరీస్’ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.  బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సీరీస్ తో కియారాకు భారీగా క్రేజ్ వచ్చింది. ఈ లస్ట్ సీరీస్ ను ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఈ సీరీస్ కు నందిని రెడ్డి.. సంకల్ప్ రెడ్డి.. తరుణ్ భాస్కర్..సందీప్ రెడ్డి వంగా ఈ  నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు.వీరిని  నెట్ ఫ్లిక్స్ వారు ఎంచుకున్నారు.  అయితే క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా సందీప్ వంగా ఈ సీరీస్ నుంచి తప్పుకున్నాడట.  దీంతో మరో దర్శకుడి కోసం పలు పేర్లు పరిశీలించిన తర్వాత సందీప్ వంగా స్థానంలో మహానటి డైరెక్టర్  నాగ్ అశ్విన్ సెలక్ట్ అయ్యాడట.

త్వరలోనే నాగ్ అశ్విన్ ఈ లస్ట్ సీరీస్ కు సంబంధించిన షూటింగులో పాల్గొంటారట. నాగ్ అశ్విన్ ఇప్పటివరకూ తెరకెక్కించిన సినిమాలన్నీ క్లాసిక్ ఫిలిమ్స్ కావడం విశేషం. ఇక   ఈ లస్ట్ స్టోరీస్ బోల్డ్ స్టైల్ లో ఉంటాయి.  మరి నాగ్ అశ్విన్ ఇలాంటి బోల్డ్ కథలను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని గుసగుసలు వినిపిస్తున్నాయి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss