Home ఆర్టికల్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే

99telugu, Happy Birthday Mahesh Babu, mahesh babu, Mahesh Babu Birthday, Mahesh Babu Birthday Celebrations, Mahesh Babu Birthday Today, Mahesh babu Birthday WIshes, Mahesh Babu Birthday Wishes From Stars, Sarkaru Vaari Paata Motion Poster, Super Star Mahesh babu Birthday

Mahesh Babu Birthday

ఆగష్టు 9.. ఈ రోజు గురించి ఒక సూపర్ స్టార్ అభిమానులు సంవత్సరం అంతా ఎదురుచూసే పండుగ. ఆ రోజు జరిగే సంబరాలు తమ అభిమాన నటుడు గురించి సోషల్ మీడియాలో చేసే ట్వీట్స్ ఎప్పుడూ వారికి అమితమయిన ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఈ రోజు గురించి ఆ సూపర్ స్టార్ గురించి మనకు తెలియని విషయాలు మీకు తెలుసా..?

1975 ఆగష్టు 9 న ఘట్టమనేని మహేశ్ బాబు పుట్టినా అభిమానులకు మొట్ట మొదటగా తాను హీరో గా పరిచయమయిన రోజు జులై 30 1999. ఆ రోజు నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయిగా తెలిసినా తరువాత చేసిన సినిమాలతో సూపర్ స్టార్ మహేశ్ బాబుగా ఎదిగి, ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. అయితే  మహేశ్ కి మాత్రం సిల్వర్ స్క్రీన్ కొత్తేమ్ కాదు. తాను చిన్న వయసులోనే దాదాపు 8 సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. దానిలో 4 సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ గారు డైరెక్ట్ చేసినవే. అయితే ఈ సినిమాలన్నీ వేసవి కాలం సెలవులలో చెయ్యడం మరో విశేషం.

మహేశ్ బాబు చదువు దృష్ట్యా సినిమాలకు దూరంగా చదువు మీద దృష్టి సారించేలా సూపర్ స్టార్ కృష్ణ గారు తీసుకున్న నిర్ణయం, తాను చెన్నై లయోలా కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన వెంటనే, సినిమాలలో నటించేలా తగిన శిక్షణను ఇవ్వడం జరిగింది. అయితే ఈ శిక్షణ స్టార్ మేకర్ సత్యానంద్ గారు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో తెలుగు చదవడం రాని మహేశ్ డైలాగులు మాత్రం ఒక సారి వినిపిస్తే వెంటనే చెప్పేయగల ఏక సంతాగ్రాహి అని మహేష్ ను అభినందించారు. అయితే తనలో చిలిపితనం కూడా ఉందని అప్పుడే గమనించిన సత్యానంద్ గారు శిక్షణ మొత్తం ఇచ్చాక కృష్ణ గారికి టాప్ యాక్టర్ అవుతాడని చెబితే పక్కన ఉన్న కృష్ణ గారి బంధువు సత్యానంద్ గారిని కొన్ని రోజుల వ్యవధిలో ఎలా చెప్తారు అని అడిగితే ఆయన మీరే చూస్తారు అన్న సమాధానాన్ని నిజం చేస్తూ…..

మహేష్ గా ఉన్న తాను సూపర్ స్టార్ మహేష్ బాబు గా ఎదిగిన తీరు చూస్తే ఆ మాటను నిజం చెయ్యడానికి మహేష్ పడిన తపన, కష్టం అనిర్వచనీయం. అయితే జులై 30 1999 రిలీజ్ అయిన రాజ కుమారుడు చిత్రం నుంచి మొదలుకొని యువరాజు, మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భారత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకేవ్వరు వరకు అలుపెరుగని కష్టం మహేష్ ను సూపర్ స్టార్ లెవెల్ కు తీసుకెళ్లింది. అయితే ఇన్ని సూపర్ హిట్ ల మద్య తాను చేసిన సినిమాలు విజయం సాదింకఃకపోయినా ప్రముఖుల మరియు క్రిటిక్స్ మన్ననలు పొందాయి. వీటిలో నిజం మూవీలో మహేష్ చేసిన నటన అనిర్వచనీయం. మహేష్ బాబు చేసినన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు మేము ఇప్పటివరకు చేయలేదని ఒక ప్రముఖ హీరో అన్నాడంటే మహేష్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఏ విదంగా ఉంటుందో అర్ధమవుతుంది.

ఇంత బెస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే మహేష్ బాబు ఒక సారి కధ కనుక నచ్చితే ఎటువంటి ప్రశ్నలు కూడా వేయకుండా పూర్తిగా తన నటన మీద మాత్రమే శ్రద్ధ పెట్టి డైరెక్టర్ చెప్పిన కధకు పూర్తి న్యాయం చేసే కృషికి నిధర్శనం తనను వరించిన 8 నంది అవార్డులు మరియు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు. దర్శకులు అనుకున్న క్యారెక్టర్ ను పూర్తిగా అభినయించడంలో మహేష్ బాబు తీసుకునే శ్రద్ధకు ఆ డైరెక్టర్లు కూడా ఫిధా కావలసిందే ఇంకా ప్రేక్షకులు వంతు చెప్పనవసరం లేదు.

అయితే ఇంతటి అభిమానం మహేష్ నటన సామధ్యాలు వలన వచ్చిందా అంటే.. మనకు కనిపించే మరో సమాధానం మహేష్ సేవాగుణం. అవును దాదాపు 3 సంవత్సరాల వరకు తాను పిల్లలకు హార్ట్ సర్జరీకి సహాయం చేసినట్టు తెలియదంటే మహేష్ సేవాభావం ఎంతటి గొప్పతో అర్ధమవుతుంది. దాదాపు 1000 మంది పిల్లకు క్రితం సమవత్సరం వరకు హార్ట్ సర్జరీ చేయించాడని తన భార్య నమ్రత చెప్పేంత వరకు తన అభిమానులకు తెలియదు. కాగా ఈ సహాయం ఆంధ్ర హోస్పిటల్ మరియు లండన్ కు చెందిన లిటిల్ హార్ట్ ఫౌండేషన్ సంస్థ కలిసి చేపట్టడం జరిగింది, కాగా ఇదీ  ఇప్పటికీ కొనసాగుతుండటం గమనార్హం. అంతే కాకుండా తన తండ్రి పుట్టిన ఒరు బుర్రిపాలెం ను సైతం దత్తత తీసుకున్న మహేష్ ఎన్నో సహాయ కార్యక్రమాలు చెయ్యడం జరిగింది.

తన భిమానుల మనస్సును దోచుకుని అంతటి అభిమానానికి ముఘ్దుడై వారికి కృతజ్ఞ్యత చెబుతున్న మహేష్ బాబు, తాను సహాయం చేసిన పిల్లల మొహంలో ఆనందం చూస్తూ వారితో గడుపుతున్న ఈ రెండు చిత్రాలు చాలవా తాను ఏం సాదించాడో తెలియడానికి, ఆయన అభిమానులు ఈ రోజు పండుగ చేసుకోవడానికి..?

ఇంతగా తన అభిమానాన్ని, సేవ ధృక్పధాన్ని, సామాజిక భాద్యతను తుచా తప్పకుండ పాటించే మహేష్ తన ఫమిలీ టైమ్ ను కూడా ఎంతో విలువైనదిగా భావిస్తాడు. తన భార్య నమ్రత శిరోధ్కర్ ఇంటి భాద్యతలు పూర్తిగా తానే చూసుకుంటుంది అని చెప్పే మహేష్ తన పిల్లలతో గడిపే సమయం కోసం ఎప్పుడు ఎదురుచూస్తుంటాడు. మహేష్ తన ఫ్యామిలీ తన కొడుకు గౌతమ్ కృష్ణతో వీడియొ గేమ్స్ ఆడుతూ, తన ఇంటిలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్ లో స్విమ్ చేస్తూ గడిపే మహేష్ తన కూతురు సితారతో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన కూతురు చేసే చాష్టాలను మహేష్ చేసే అల్లరిని నమ్రత తన సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి.

ఇంత సాదించిన మహేష్ ఎదురుచూసేది, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి వారస్తవాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు సినీ తెరపై తాను నటించిన చిత్రం ప్రేక్షకులకు నచ్చి ఘన విజయం సాదిస్తే ఆ ఆనందాన్ని తన తండ్రి కళ్ళలో చూస్తూ ఉండటం ఆ సినిమా మొదలయ్యే ముందు తన అమ్మ గారు పెట్టిన కాఫీ తాగడం ఇంకా తన కుటుంబంతో హ్యాపీ లైఫ్ లీడ్ చెయ్యడం.

అందుకే ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆ సూపర్ స్టార్ విత్ సూపర్ హార్ట్… ఘట్టమనేని మహేష్ బాబు ఆ వెరీ హ్యాపీ బర్త్ డే..

ఇది కూడా చదవండి: 

 

Exit mobile version