Monday, May 10, 2021

Latest Posts

సూపర్ స్టార్ కూతురు స్టెప్పులతో  దుమ్మురేపింది .. 

ఈకాలం పిల్లలను పట్టుకోవడం కష్టమని అంటుండడం వింటుంటాం. అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ రావడంతో సమస్త ప్రపంచం ముంగిట ఉన్నట్లే. దాంతో సోషల్ మీడియాలో పిల్లలు దూసుకుపోతున్నారు. ఇక సినిమా స్టార్స్ పిల్లలైతే టాప్ మోస్ట్ లో సోషల్ మీడియాను కమ్మేస్తున్నారు. ఇక   టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు, నమ్రతల గారాల పట్టీ సితార పాప మల్టీ ట్యాలెంటెడ్‌ చైల్డ్ అని చెప్పక తప్పదు.  ఈ పసి ప్రాయంలోనే అటు యూట్యూబ్‌లో వీడియోలు, ఇంటర్వ్యూలు చేసి అదరగొట్టేస్తూ, మరోవైపు నాట్యం నేర్చుకుంటోంది. క్లాసికల్‌ డ్యాన్స్‌తో పాటు తన తండ్రి సినిమా పాటలకు ఔరా అనిపించేలా స్టెప్పులు వేసేస్తుంది.

తాజాగా మహేశ్‌ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’  సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రంలోని ‘డాంగ్‌ డాంగ్‌’ సాంగ్‌కు మహేష్ ముద్దుల తనయ స్టెప్పులేసింది. ఆ పాటలో తమన్నా వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్టు సితార వేసేసి ఔరా అనిపించింది.  డాంగ్‌ డాంగ్‌ సాంగ్‌కు సితార చేసిన డ్యాన్స్‌  నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో  ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అయింది. అంతేకాకుండా సితార ప్రతిభను నెటిజన్లు అభినందిస్తున్నారు.

ఇక   సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి ‘ఏ అండ్‌ ఎస్‌’ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా రన్ చేస్తున్నారు. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరో మహేశ్‌ బాబు, హీరోయిన్‌ రష్మిక మందనలను ఇంటర్వ్యూ చేశారు. ఇక ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను మహేశ్‌ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇదే టూర్‌లో మహేశ్‌ తన మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. విశ్రాంతి అనంతరం స్వదేశానికి తిరిగొచ్చి వంశీ పైడిపల్లి చేయబోయే సినిమా లో చేయనున్నాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss