Monday, July 26, 2021

Latest Posts

సీతారాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ కుటుంబం

Mahesh Babu Family Wishes Sitara Happy Birthday

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సీతారా ఘట్టమనేని ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ జూలై 20న సితారా తన 9వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి తన కుమార్తె సీతారాను విష్ చేశాడు. “పుట్టినరోజు శుభాకాంక్షలు, నా చిట్టి తల్లికి!! ఎల్లప్పుడూ నా ప్రపంచాన్ని వెలుగొందించు. హ్యాపీ 9, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నాను”, అని మహేష్ విష్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ఆ తరువాత తల్లి నమ్రత మరియు సోదరుడు గౌతమ్ కూడా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్ తనదైన శైలిలో తన చెల్లెలికి శుభాకాంక్షలు అందజేశాడు. నాకు చాలా కోపం తెప్పిస్తుంది కాని ఆమె లేకుండా ఒక రోజు కూడా ఉండలేను పుట్టినరోజు శుభాకాంక్షలు సితారాఘట్టమనేని .. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని గౌతమ్ విష్ చేశాడు. సూపర్ స్టార్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో సీతారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు .

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss