Thursday, May 13, 2021

Latest Posts

అందుకే మహేష్ ని పక్కనపెట్టేశారా ?

Mahesh Babu instead of Ram Charan in Chiranjeevi’s next movie:

ఏదైనా విషయంపై క్లారిటీ రానంత వరకూ ఎన్ని వార్తలైన చక్కర్లు కొట్టేస్తాయి. అందులో నిజమెంత,అబద్ధమెంత అనేది తెలిసేలోగా చాలా వార్తలు,కథనాలు వైరల్ అయిపోతాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ జ‌రుపుకుంటుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌ గురించి రకరకాలా కథనాలు వస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతోంది.

వాస్తవానికి ఈ కీలక పాత్రను ముందు రామ్‌చ‌ర‌ణ్ చేస్తాడ‌ని అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ కార‌ణంగా రామ్‌చ‌ర‌ణ్ చేయ‌లేడ‌ని,అందుచేత,బన్నీ కానీ మ‌హేశ్ కానీ చేస్తే బాగుంటుందని వార్తలొచ్చాయి. చివరకు ఆ పాత్ర‌ను మహేష్ చేస్తాడ‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే 30రోజుల పాత్ర కోసం మ‌హేశ్ రూ.30కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేశాడ‌ని కూడా వార్త‌లు చక్కర్లు కొట్టాయి.

మరోపక్క ఈ పాత్ర తనకు వదిలేయాలని బన్నీ కూడా మహేష్ ని బతిమాలినట్లు మరో వార్త వచ్చింది. అయితే మహేష్ ని ముందు ఓకే అనుకున్న‌ప్ప‌టికీ అంత భారీ రెమ్యున‌రేష‌న్ కార‌ణంగా బ‌డ్జెట్ ప‌రిమితులు దాటి పోతున్నందున చ‌ర‌ణ్‌తోనే ఆ పాత్ర‌ను చేయించాల‌ని మెగా వ‌ర్గం అభిప్రాయ పడుతున్నట్లు సోష‌ల్ మీడియాలో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటనేది క్లారిటీ వస్తే తప్ప ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss