Saturday, May 15, 2021

Latest Posts

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise :

తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు తప్ప బాలీవుడ్ లేక హాలీవుడ్ సినిమాలు చేయనని ఇంతకు ముంది స్పష్టం చేశారు. కాకపోతే తాను చేయబోయే తన నెక్స్ట్ సినిమా రాజమౌళి తో కావడం వలన, ఈ ఒట్టు తీసి గట్టు మీద పెట్టాల్సి వస్తుంది అంకుంటున్నారు సినీ జనాలు. మహేష్ బాబు రీసెంట్ గా “సరిలేరు నీకేవ్వరు” మూవీ ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసి కంప్లీట్ చేసి రిలీస్ కూడా చేసేశారు. కాగా ఈ విషయాన్ని సినిమాకి సంబందించిన వాళ్ళు కాదు, ఏకంగా ప్రీ రిలీస్ కి గెస్ట్ గా వచ్చిన మెగా స్టార్ చిరంజీవి నోటి నుంచి రావడం విశేషం.

చిరంజీవి మాట్లాడుతూ ఒక పేపర్ లో మహేష్ బాబు పోస్టర్ చూసి అభినందించానని, కాగా కొన్ని రోజుల తర్వాత సినిమా కంప్లీట్ అయ్యింది, మీరు గెస్ట్ గా రావాలని అన్నారని చెప్పారు. అది విన్న నేను షాక్ అయ్యాను. ఈ కాలంలో సంవత్సరం పైగా ఒక సినిమా తియ్యడానికి పడుతుంది అని, అలాంటిది 6 నెలలలో సినిమా పూర్తి చెయ్యడం శుభ పరిణామం అని. ఇలాంటి పరిస్తితులు మళ్ళీ రావాలని మహేష్ బాబును, డైరెక్టర్ అనిల్ రావిపూడిని అభినందించారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు చేయబోయే తర్వాత సినిమా రాజమౌలితో కావడం వల్ల ఈ ఒట్టు తీసి గట్టు మీద పెట్టలేమో అనిపిస్తుంది మహేష్ బాబు. రాజమౌళి తో సినిమా అంటే కనీసం రెండేళ్ళు టైమ్ పడుతుంది. దానికి ఉదాహరణ ఏకంగా రాజమౌళి తన నోటితో తానే ప్రభాస్ సగం కెరీర్ తినేశానని అన్నారు. కాబోతే ఇప్పుడు మహేష్ బాబు పరిస్తితి ఏంటో వేచి చూడాల్సి ఉంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss