Monday, May 10, 2021

Latest Posts

సూపర్ స్టార్ మహేశ్ బాబు కి ఈ రోజు ప్రత్యేకమైన రోజు

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికే ప్రయత్నిస్తారు. అయితే ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీ తో గడిపే మహేశ్ కు ఈ రోజు అనగా ఏప్రిల్‌ 20 ప్రత్యేకం. ఎందుకంటే మహేష్ బాబు‌ తల్లి ఇందిరా దేవీ పుట్టినరోజు నేడు. దీంతో తల్లితో కలిసి దిగిన ఫోటోను మహేష్‌బాబు షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

ఇక మహేష్‌ సోదరి మంజులా సైతం తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తన నువ్వులానే తన వ్యక్తిత్వం కూడా ఎంతో స్వచ్చమైనది. మా జీవితంలోని ప్రతీ రోజును గొప్పగా తీర్చదిద్దావు. మన కుటుంబానికి నువ్వే వెన్నముక..లవ్‌ యూ అమ్మ..హ్యపీ బర్త్ డే అమ్మ’ అంటూ మంజులా ట్వీట్ చేసింది.

 మహేశ్ ప్రస్తుతం పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా ‘మహా నటి’ కీర్తి సురేష్‌ నటిస్తుంది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss