మహేశ్ బాబు న్యూ లుక్ ఆ సినిమా కోసమేనా? మహర్షి సినిమాలో స్టూడెంట్ గా కనిపించిన మహేశ్ బాబు ఇప్పుడు లవర్ బాయ్ గా కనువిందు చెయ్యనున్నాడా? అయితే అవును అంటున్నాయి సినీ వర్గాలులో తిరిగే పుకార్లు. ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ లో ఉండగా ఒకొక్కరూ వారి వారి క్వారంటైన్ టైమ్ ని ఇష్టమొచ్చినట్టు ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటే….
మహేశ్ బాబు మాత్రం తన పిల్లలతో వీడియో గేమ్స్ ఆడుతూ కనువిందు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మహేశ్ బాబు తన పిల్లలతో తీసుకున్న ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో మహేశ్ బాబు ఇంతక ముందు ఉన్న యంగ్ మహేశ్ బాబు కంటే ఇంకా యంగ్ గా కనిపించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రింగుల జుట్టుతో, ఛార్మింగ్ లుక్ తో ఉన్న మహేశ్ బాబు త్వరలో చేయబోయే పరశురామ్ సినిమాలో ఇలా కనువిందు చేయనున్నట్టు తెలుస్తుంది.
Mahesh Babu New Look In Parasuram Movie
ఇది కూడా చదవండి: రమ్యకృష్ణ తో కలిసి ఫైట్ చేయనున్న విజయ్ దేవరకొండ