Home సినిమా వార్తలు చెడులోనూ మంచిని వెతుక్కోవాలి అంటున్న మ‌హేశ్ బాబు

చెడులోనూ మంచిని వెతుక్కోవాలి అంటున్న మ‌హేశ్ బాబు

mahesh babu says you should look for good in evil

ఎల్లప్పుడూ, మనకు సాధ్యమైనంతవరకు  మన వంతు భాద్యతగా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు సాయం  చేయాలని సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు  గారు అన్నారు.  ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనావైరస్ వున్న ఇలాంటి  విపత్కర సమయంలోనే అంద‌రం ఇళ్లలోనే ఉండ‌టం వ‌ల్ల‌ వాతావ‌ర‌ణానికి రోజు కొంచెం మేలు జ‌రుగుతుంద‌ని మాములు సమయాల్లోనూ కూడా మనం  ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు సాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశమంత‌టా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నమాట  వాస్తవమే కానీ చెడులోనూ మంచిని వెతుక్కోవాలనట్లు కోవిడ్-19 వల్ల మనకు జరుగుతున్న మరో మేలు వాతావరణంలో కాలుష్యం తగ్గటం అని ఆయన అభిప్రాయాన్ని తెలిపారు. అలాగే మహేశ్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల సైతం భూమిని మనం పరిరక్షించుకోవాలంటూ సోషల్  మీడియాలో ధరిత్రీ దినోత్సవం సంద‌ర్భంగా సూచనలు చేస్తున్నారు.

Exit mobile version