Monday, July 26, 2021

Latest Posts

తెలంగాణ టాప్ స్విమ్మర్స్ జాబితాలో మహేశ్ బాబు కొడుకు

Mahesh Babu Son Gautam

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 1-నేనోక్కడినే లో చైల్డ్ ఆర్టిస్ట్ గా  సినిమాలలో అడుగుపెట్టారు. మహేష్ మరియు అతని భార్య నమ్రత తమ పిల్లల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు కాని గౌతమ్ గురించి అభిమానులకు పెద్దగా తెలియదు. సీతారా కూడా తన యూట్యూబ్ ఛానెల్‌లో క్రమం తప్పకుండా కనిపిస్తుంది కానీ గౌతమ్ ఏం చేస్తున్నాడనేది పెద్దగా ఎవరికీ తెలియదు.

తాజాగా గౌతమ్ గురించి ఒక అద్భుతమైన వార్త వచ్చింది. అదే గౌతమ్ స్విమ్మింగ్ చేస్తూ తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్‌లో, అండర్ 15 కేటగిరిలో, టాప్ 8 ఈతగాళ్ళలో తన స్థానాన్ని సాధించాడు. 15 ఏళ్ల గౌతమ్ ఆయుష్ యాదవ్‌తో కలిసి ఈతలో శిక్షణ పొందుతున్నాడు. ఆయుష్ యాదవ్ ఒక ప్రొఫెషనల్ స్విమ్ కోచ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణతో కలిసి రాష్ట్ర కోచ్ గా పనిచేస్తున్నాడు. తన కొడుకు సాధించిన విజయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో గర్వంగా పంచుకున్నారు నమ్రత.

గౌతమ్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో పోస్ట్ చేస్తూ, “2018 నుండి ప్రొఫెషనల్ గా స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు గౌతమ్ టాప్ 8 కి రీచ్ అయ్యాడు. తన యొక్క పట్టుదల, కృషితో ఈ ఆటను ఆస్వాదిస్తున్నాడు. బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ మరియు ఫ్రీస్టైల్ ను సులభంగా చేస్తున్నాడు. వీటిలో తనకిష్టమైనది ఫ్రీస్టైల్. ఇందులో గౌతమ్ 3 గంటలలో 5 కి.మీ స్విమ్ చేశాడు అని నమ్రత చెప్పారు.”

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss