Sunday, June 20, 2021

Latest Posts

లవ్ స్టోరీ కి సాయం చేస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ ని అందించడంలో దిట్ట అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా అలాంటి మరో చిత్రంతో మన ముందుకి రాబోతున్నాడు. ఆ సినిమా టైటిల్ కూడా అలానే ఉంది. ఆ టైటిల్ ఏమిటంటే ‘లవ్ స్టోరీ’. ఈ ‘లవ్ స్టోరీ’ లో హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పాటలు ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి.

ఇటీవల విడుదలైన ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్ లో  75 మిలియన్లు సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి నాల్గవ పాట విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ పాట రాబోతునట్టు చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నాగ చైతన్య మరియు సాయి పల్లవి వర్షంలో డ్యాన్స్  చేస్తున్నట్లుగా ఉంది.

ఈ నాల్గవ పాట ‘ఏవో ఏవో కలలే’ అంటూ మొదలవ్వబోతుంది, దీనిని సూపర్ స్టార్ మహేష్ బాబు మార్చి 25 న ఆవిష్కరించనున్నారు. మరి సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంచ్ చేయబోతున్న ఈ పాట ఎన్ని మిలియన్స్ కొడుతుందో వేచి చూడాలి.

నారాయణ్ దాస్ కె. నారంగ్ & పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 16 న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss