Thursday, May 13, 2021

Latest Posts

చరణ్ ని రీప్లేస్ చేసిన మహేష్ బాబు

Mahesh Babu replaces Charan in chiru152 movie:

చరణ్ ని రీప్లేస్ చేసిన మహేష్ బాబు

  చరణ్ కోసం రాసుకున్న క్యారెక్టర్ ని మహేష్ కోసం కంప్లీట్ గా మారుస్తున్నారా? మెగాస్టార్ కోసం సూపర్ స్టార్ కేటాయించిన కాల్ షీట్ల లెక్కేంటి? ఇంతకీ ఘట్టమనేని హీరో పక్కన పక్కాగా ఫిక్స్ అయ్యే హీరోయిన్ ఎవరు? ఇవన్నీ ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్న టాపిక్స్….. #చిరంజీవి152 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

   ఈ సినిమాలో చిరంజీవి యంగ్ రోల్ కోసం ముందు చరణ్ ని అనుకున్న మూవీ టీం ఇప్పుడు మహేష్ బాబు వంక చూస్తోంది. కారణం చరణ్ #RRR మూవీ లో బిజీగా ఉండడం, చిరంజీవి సినిమాలో యంగ్ రోల్ క్యారెక్టర్ కోసం మహేష్ బాబును తీసుకోనున్నారు? అల అయితే మహేష్ బాబు కోసం ఇంతకు ముందు చరణ్ కోసం రాసిన ఆ యంగ్ క్యారెక్టర్ రీరైట్ చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్ కొరటాల. నిన్నటి స్క్రిప్ట్ లో ఉన్న యంగ్ నక్సలైట్ ఇప్పుడు అగ్రసివ్ స్టూడెంట్ లీడర్ గా మారబోతున్నాడు, అంటే కొరటాల మూవీలో మళ్ళీ మహేష్ స్టూడెంట్ రోల్ చేస్తున్నారన్న మాట!

    కొరటాల డైరెక్షన్లో శ్రీమంతుడులోను, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహర్షిలోను స్టూడెంట్ గా కనిపించారు మహేష్. రీసెంట్ టైమ్స్ లో ఆ రెండు మూవీస్ తర్వాత మళ్ళీ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నారు, మహర్షిలో మహేష్ తో జత కట్టిన పూజ హెగ్డే కొరటాల మూవీలోను ఫిమేల్ లీడ్ గా యాక్ట్ చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ కోసం 25 డేస్ తన కాల్ షీట్స్ కేటాయించారని టాక్. మేలో మహేష్ పోర్షన్ ను షూట్ చేయనున్నారు. చిరంజీవి పక్కన త్రిష నటిస్తున్న ఈ మూవీ షూటింగ్, ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మహేష్ సెట్స్ చేరుకునే సమయానికే బాలన్స్ షీట్ మొత్తం పూర్తి చేయాలన్నది టీం ప్లాన్ అట.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss