Tuesday, May 18, 2021

Latest Posts

వద్దన్నా డైరెక్టర్ కావాలంటున్న మహేష్

Mahesh Babu To Work With Parashuram:

వద్దన్నా డైరెక్టర్ కావాలంటున్న మహేష్

ఇండస్ట్రీలో ఒక్కసారి నో చెప్పిన తర్వాత మళ్ళీ భేరాలుండవు ఆ డీల్ అక్కడితో ఆగిపోతుంది అంతే, కానీ మహేష్ మాత్రం నో చెప్పిన డైరెక్టర్ తోనే మళ్ళీ సినిమా చెయ్యడానికి ట్రై చేస్తున్నాడంట. ఆల్రెడీ టాక్ కూడా జరుగుతున్నాయి అని చెబుతున్నారు, మరి మహేష్ నుంచి మళ్ళీ కాల్ వచ్చిన ఆ డైరెక్టర్ ఎవరో కాదు గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్.  మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని చెప్పాడు, స్క్రిప్ట్ సిద్ధం అవ్వగానే సెట్స్ కి తీసుకెళ్తానని ప్రకటించాడు. కానీ వీళ్ళ ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యిందని వార్తలొచ్చాయి, స్క్రిప్ట్ విషయంలో చిన్న కన్ఫ్యూషన్ వచ్చిందని అందుకీ వంశీ పైడిపల్లికి మహేష్ బాబు మరి కొంత టైం ఇచ్చాడని తెలుస్తుంది. అలాగే ఈ టైంలో మరొక మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్ వచ్చింది. 

గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు కోసం ట్రై చేసాడు పరశు రామ్. డిస్కషన్ కూడా జరిగింది కానీ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. అయితే వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పక్కకి వెళ్లిపోవడంతో మళ్ళీ పరశురామ్ కి కాల్ వెళ్లిందట. కానీ జరిగిన డిస్కషన్ లో సెట్ కానీ ప్రాజెక్ట్ తర్వాత పరశు రామ్ నాగ చైతన్యతో కలసి “నాగేశ్వర రావు” అనే సినిమాను అనౌన్స్ చేసాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబు నుంచి కాల్ రావడంతో ఎన్నాళ్ళనుంచో దురుచూస్తున్న ఛాన్స్ ససడన్ గా రావడంతో డైరెక్టర్ పరశురాం నాగ చైతన్య సినిమాను పక్కన పెట్టి మహేష్ దగ్గరకి వెళ్తాడా! లేక నాగ చైతన్య సినిమా పూర్తి చేస్తాడా! లేదో చూడాలి.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss