Monday, May 10, 2021

Latest Posts

మహేశ్ బాబు త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త హీరోయిన్ వస్తుందా!

Mahesh Babu Trivikram Srinivas Movie Heroine

త్రివిక్రమ్-మహేష్ బాబు చిత్రం చేస్తున్నారని ఇలా ప్రకటించారో లేదో అప్పుడే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని పై చర్చ మొదలయ్యింది. ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. దీనితో వీరు సరైన హీరోయిన్ కోసం వెతికే పనిలో పడ్డారు.

అయితే మొదటగా ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో ఆమె కథానాయికగా చేస్తుందని ప్రకటించడంతో ఇప్పుడు చిత్రబృందం అయోమయంలో పడినట్లు తెలుస్తుంది.

దీనితో త్రివిక్రమ్ మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారట. ఇప్పటికే త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసిన పూజ హెగ్డే అయితే మహేశ్ కి జోడీగా బాగుంటందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట. అయితే ఆమె ఫుల్ బిజీగా ఉండటంతో ఆమె డేట్స్ అడ్జస్ట్ అవుతాయో లేదోని చిత్ర బృందం ఆందోళన చెందుతుందట.

తాజాగా మరో రూమర్ ఏంటంటే జాన్వి కపూర్‌ను తెలుగు తెరకి పరిచయం చేయడానికి ఈ చిత్ర నిర్మాణ సంస్థ హరిక హస్సిని బ్యానర్‌కు కొన్ని ఆలోచనలు చేస్తుందంట. మహేష్ బాబుతో జత కట్టడానికి ఆమెను కూడా పరిశీలన చేస్తునట్టు తెలుస్తుంది. అయితే మరి మహేశ్ తో ఏ హీరోయిన్ జోడీ కడుతుందో వేచి చూడాల్సిందే. ఇకపోతే మహేశ్ సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసిన వేంటనే ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడట.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss