Sunday, June 20, 2021

Latest Posts

మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో స్టార్ట్ కానున్న సినిమా!

Mahesh Babu Trivikram Srinivas Movie
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌ మరోసారి కలవనుంది. త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు మహేశ్‌ ఇప్పటికే పలు ఇంటర్య్వూలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ ‘సర్కారు వారి పాట’  సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో కూడా ఓ సినిమా చేస్తానని చెప్పాడు మహేశ్.

అయితే రాజమౌళి కంటే ముందే త్రివిక్రమ్ తో జతకడుతున్నట్లు తెలుస్తోంది. ఇది మహేశ్ బాబు 28వ చిత్రంగా తెరకెక్కనుంది. దీనిని ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28 అనే టైటిల్ తో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందులో మహశ్‌కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుందని సమాచారం. జీఎమ్‌ బెంటస్‌, హారిక హాసిన్‌ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

మరి త్రివిక్రమ్ ఎన్‌టి‌ఆర్ తో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఒకే సారి రెండు సినిమాలు చేస్తారా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss