Wednesday, June 23, 2021

Latest Posts

కరోనాపై సూపర్ స్టార్ ఆరు సూత్రాలు

Mahesh Babu’s six essential rules to fight Coronavirus:

అక్కడా ఇక్కడా అని లేకుండా అన్నిచోట్లా చొచ్చుకూస్తూ,భయానక వాతావరణం సృష్టిస్తున్న  క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని నివారించ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వారాల పాటు లాక్ డౌన్‌ను ప్ర‌క‌టించాయి. ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సినీ తార‌లు ప‌లువురు క‌రోనా నివార‌ణ కోసం ప‌లు జాగ్ర‌త్త‌లను సూచిస్తున్నారు.

సెలబ్రిటీలు చెబితే కనీసం వింటారన్న నానుడి ఉంది.  ఈ నేపథ్యంలో  సూప‌ర్‌స్టార్ మహేశ్ ట్విట్ట‌ర్ ద్వారా ఆరు  సూచ‌న‌లు చేశారు. ఇప్పటికే సూపర్ స్టార్ ఈ అంశంపై స్పందించగా, తాజాగా మ‌హేశ్ ఉగాది శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ ఈ సూచ‌న‌లు చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేసిన సూచ‌న‌లు పాటించాలని, మంచి సోర్సు ద్వారా వ‌చ్చే స‌మాచారాన్ని మాత్ర‌మే న‌మ్మాల‌ని, కరోనాపై పోరాడాల‌ని ఆయ‌న సూచించారు.

1. ఇంట్లోనే ఉండాలి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట అడుగు పెట్టాలి.
2. రోజులో చాలా సార్లు స‌బ్బుతో 20-30 సెక‌న్ల పాటు చేతుల‌ను క‌డుగుకోవాలి.
3. మీ ముఖాన్ని చేతుల‌తో తాకవ‌ద్దు. ముఖ్యంగా క‌ళ్లు, ముక్కు, నోటి బాగాల‌ను తాక‌రాదు.
4. ద‌గ్గుతున్న‌ప్పుడు, తుమ్ముతున్న‌ప్పుడు మీ ముఖానికి మో చేతులు లేదా టిష్యూని అడ్డం పెట్టుకోండి
5. సామాజిక దూరం  అవ‌స‌రాన్ని గుర్తించండి. ఇంట్లో, బ‌య‌ట ఇత‌రుల‌తో మూడు మీట‌ర్ల దూరం పాటించండి
6. మీకు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉంటేనే మాస్కును ఉప‌యోగించండి. మీకు కోవిడ్ 19 ల‌క్ష‌ణాలుంటే డాక్ట‌ర్ని సంప్ర‌దించండి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss