Tuesday, January 25, 2022

Latest Posts

ఉత్తరప్రదేశ్‌ రోడ్డు ప్రమాదంలో 18మంది మృతి

Major road accident in UP

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డబుల్ డక్కర్ బస్సును  భారీ ట్రక్కు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బీహార్‌కు చెందిన వలసకూలీలు హర్యానా నుంచి స్వస్థలాలకు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాదమిక అంచనా. ఈ ప్రమాదంలో 19మంది మృతి చెందగా 25మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బీహార్‌వాసులుగా గుర్తించారు అధికారులు. ట్రక్కు ఢీ కొనడంతో బస్సు ముందు భాగమంతా నుజ్జునుజ్జు అయ్యింది. వలస కూలీలంతా బస్సు ముందు భాగంలోనే ఉండటంతో వారంతా చనిపొగ బస్సు వెనుక బాగంలో ఉన్న వారంతా బస్సులోనుంచి రోడ్డుపై పడ్డారు. ప్రమాదానికి గురైన డబుల్ డక్కర్ బస్సులో సుమారు వందకుపైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణికులంతా బీహార్‌కు చెందిన వివిధ ప్రాంతాల వారుగా గుర్తించారు పోలీసులు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss