Tuesday, April 13, 2021

Latest Posts

కన్నీరు పెట్టుకున్న మమతా

రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ, హత్యలుండవని అంటారు. అయితే వేధింపులు మాత్రం ఉంటాయని అంటుంటారు. అధికారంలో ఉన్నవాళ్లు ఎలా ఏడిపించాలో అలా ఏడిపిస్తారని పలు సంఘటనలు రుజువుచేస్తుంటాయి. అయితే కొన్ని తప్పులు ఒక్కోసారి కావాలని జరిగితే,మరికొన్ని సార్లు పొరపాడు వలన జరగొచ్చు. ఇక  ఈస్ట్ – వెస్ట్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవానికి తనను కేంద్రం ఆహ్వానించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ విషయంలో  తాను చాలా బాధపడ్డానని  మమతా బెనర్జీ  వెల్లడించారు. ఈ విషయంలో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. తాను రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపానని, దీని కోసం చాలా కష్టపడ్డానని, అలాంటిది ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రం ఆహ్వానించకపోవడం విడ్డూరమని ఆమె వాపోయారు.

‘‘నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నా. కనీసం నాకు సమాచారం అందివ్వకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసేశారు’’ అని మమతా  వాపోయారు. ఈస్ట్- కోస్ట్ రైల్వే కారిడార్‌ను గురువారం కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్ ప్రారంభించారు. అయితే ఆహ్వాన పత్రికలో మాత్రం టీఎంసీ నాయకుల పేర్లు ఎక్కడా ప్రచురించక పోవడంతో తృణమూల్ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss