Monday, July 26, 2021

Latest Posts

దేశంలో మండుతున్న పెట్రో ధరల పై మండి పడ్డ మమతా

Mamata Banerjee Fires On Increasing Petrol Prices In Country

దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దీనికి బాధ్యులుగా మోడీని ఎండగట్టారు. ఆమె ప్రధాని మోడీ పై విమర్శలు గుప్పిస్తూ, ఇక పై ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని కాకుండా పెట్రోల్ కీ బాత్, డీజిల్ కీ బాత్, వ్యాక్సిన్ కీ బాత్ కార్యక్రమాలను పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ధ్వంసం చేస్తున్నారని మమతా అన్నారు.

ప్రతి రోజు చుమురు ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర కేబినెట్ దాని పై మౌనంగా ఉందని  ఆమె విమర్శించారు. బాబుల్ సుప్రియోను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించడం ద్వారా 2024 కంటే ముందుగానే బెంగాల్ లో బీజేపీ తన ఓటమిని కొని తెచ్చుకుందని ఆమె అన్నారు. అయితే కేంద్ర కాబినెట్ విస్తరణపై తాను కామెంట్ చేయదలుచుకోలేదని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss