Tuesday, January 25, 2022

Latest Posts

సోనియాను కలసిన దీదీ

Mamata Banerjee Meets Sonia Gandhi

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో బాగంగా ఈ రోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. దీదీ తో సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. నిన్న దీదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో సమావేశమైన తరువాత కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను షింగ్వి తదితరులను కలుసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు (జూలై 28) 10గంటలకు జనపథ్‌కు వెళ్లి సోనియాతో ఆమె సమావేశమయ్యారు.  ఈ సమావేశం పై దీదీ  స్పందిస్తూ ఇది చాల సానుకూలమైన సమవేసమని, సమావేశంలో అనేక విషయాలపై చర్చించినట్లు దీదీ తెలిపారు. రాజకీయ పరిస్థితులు, కోవిడ్‌, పెగసాస్ స్పైవేర్ స్నూపింగ్ వివాదం గురించి సోనియాతో చర్చించినట్లు మమతా పేర్కొన్నారు. అలాగే విపక్ష కూటమి గురించి దీదీ  మాట్లాడుతూ కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారనేది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుందని, ఇది చెప్పేందుకు తానేమీ రాజకీయ జ్యోతిష్కురాలిని కాదని మీడియాతో దీదీ  అన్నారు.

ఇది కూడా కాదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss