Sunday, June 20, 2021

Latest Posts

ప్రధాని మోడీకి లేఖ రాసిన మమతా బెనర్జీ

Mamata Banerjee Writes Letter To PM Narendra Modi

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తుంది. రోజు లక్షకు పైగా కేసులు నమోదవుతుండగా, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీనితో పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆక్సిజన్‌ కొరతపై ప్రత్యేక దృష్టి సారించింది.

అయితే ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆదివారం రోజున ప్రధాని నరేంద్రమోదీకి లేఖను రాశారు. ఈ లేఖలో ఏం తెలిపారంటే కోవిడ్‌-19కి ఉపయోగ పడే ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులపై పన్నులను రద్దు చేయాలని ఆమె మోడిని కోరారు. దాంతో పాటుగా ఆస్పత్రుల్లో  మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని కోరింది. కోవిడ్‌-19 రోగుల వైద్యం కోసం అవసరమయ్యే పరికరాలను, మందులు, ఆక్సిజన్ సరఫరాను పెంచాలని మ‌మ‌తా బెన‌ర్జీ లేఖలో రాశారు.

పెద్ద ఎత్తున పలు ఎన్జీవోలు, వ్యక్తులు కోవిడ్‌-19 రోగుల కోసం ఆక్సిజ‌న్ కాన్సన్‌ట్రేటర్‌, సిలిండ‌ర్లు, క్రయోజనిక్‌ స్టోరేజీ ట్యాంకర్లను, కంటైనర్లను ప్రభుత్వానికి అందించడానికి ముందుకు వస్తున్నారని పేర్కొంది. ఈ సంస్థల నుంచి వస్తోన్న పరికరాలతో ప్రభుత్వాలకు ఆపన్నహస్తంలా ఉంటాయని మమత లేఖలో తెలిపారు. మెడికల్‌ సదుపాయాలపై పన్నుల నుంచి వెసులుబాటు కల్పించాలని స్వచ్చంద సంస్ధలు తెలిపిన విజ్ఞప్తి మేరకు, మెడికల్‌ వస్తువులపై పన్నులు వేయకుండా మినహాయింపును ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు.

అంతే కాకుండా దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందజేయాలని మమత బెనర్జీ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. దీని పై మోడీ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss