Mamata Banerjee govt objects to Central’s list of zones in Bengal
కరోనా పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మే 17వరకు దేశంలో లాక్ డౌన్ ను పొదిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించి లాక్ డౌన్ ను కొనసాగిచ్చనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిస్ట్ ప్రకారం పశ్చిమ బెంగాల్ లో రెడ్ జోన్ల లిస్టును సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. మీ రెడ్ జోన్ల లిస్టులో తప్పులున్నాయంటూ మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన కొత్త జాబితాను కేంద్రానికి పంపించారు.
పశ్చిమ బెంగాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ విషయంపై కేంద్ర హెల్త్ సెక్రటరీకి వివరణ ఇస్తూ ఓ లెటర్‌ను రాశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో కలకత్తా, హౌరా, నార్త్-24 పరగణాస్, పూరబ్ మెదినీపూర్ మాత్రమే రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని వివేక్ కుమార్ లెటర్లో పేర్కొన్నారు. బెంగాల్లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితాకు సంబంధించి తప్పులున్నాయని రాష్ట్రంలో దాదాపు 10 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నట్లు ప్రకటించారని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితులు, కరోనా కేసులు బట్టి రాష్ట్రంలో కేవలం 4 జిల్లాలు మాత్రమే రెడ్ జోన్లో ఉన్నాయని తెలిపారు.