Monday, July 26, 2021

Latest Posts

ఆనందయ్య మందు పేరుతో అమ్మకాలు చేస్తూ పోలీసులకు దొరికిన వ్యక్తి

Man Caught Selling Anandaiah Medicine

ఆనందయ్య మందు కరోనాని నిర్మూలిస్తుందని తెలియడంతో ప్రజలు అతని మందు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆనందయ్య మందు పేరుతో అమ్మకాలు చేస్తూ ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. కరోనా మందు పేరుతో అమ్మకాలు చేస్తున్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి ఒకటిన్నర లక్షల రూపాయిలు మరియు 150 ప్యాకెట్ల మందును స్వాధీనం చేసుకున్నారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో కరోనా మందు పేరిట అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆదివారం గ్రామంలో సోదాలు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడికొండ ఎస్‌ఐ బి.వెంకటాద్రి ఈ విషయాన్ని మీడియాకు వివరాలు వెల్లడించారు.

తాడికొండ గ్రామానికి చెందిన అన్నే కాంతారావు పోలీసులను చూసి పారిపోతుండగా అతనిని పట్టుకుని విచారణ చేశారు. ఈ విచారణలో గత 10 రోజులుగా గ్రామస్తులకు 750 ప్యాకెట్లను ఒక్కో ప్యాకెట్‌ రూ.200కు అమ్మినట్టు చెప్పాడు. అమ్మిన ప్యాకెట్ల తాలూకు రూ.1.50 లక్షలతో పాటు మిగతా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss