Tuesday, April 13, 2021

Latest Posts

ఫోన్లో మాట్లాడుతూనే రైలు కింద పడి మృతి

ఫోన్లో మాట్లాడుతూనే ఓ యువకుడు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి మధిర రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో జరిగింది. భద్రాద్రి జిల్లా పాత కొత్తగూడేనికి చెందిన అన్నపూర్ణమ్మ, మాధవాచారి దంపతులకు అనిల్‌ (25), వినయ్‌ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అనిల్‌కుమార్‌కు వివాహం కాగా, మనస్పర్థలతో భార్యాభర్తలు విడిపోయారు. ఈ క్రమంలో కొంతకాలంగా మనస్తాపానికి గురైన అనిల్‌ మధిరలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళుతున్నానని చెప్పి శనివారం ఉదయం ఇంటినుంచి బయటకు వచ్చాడు.

సాయంత్రం సమయంలో మధిరలోని వైరా నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో కొంతసేపు తిరిగి సెల్ఫీ ఫొటోలు తీసుకున్నాడు. రాత్రి 10:30 గంటల సమయంలో రైల్వేట్రాక్‌పైకి వచ్చి అతడి బాబాయి లక్ష్మీనారాయణకు ఫోన్‌చేశాడు. మధిర రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉన్నానని, ‘చనిపోతున్నాను నన్ను క్షమించండి’ అంటూ కాల్‌లో చివరగా చెప్పాడు. అనిల్‌ మాట్లాడుతుండగానే పెద్ద శబ్ధం వినిపించిందని లక్ష్మీనారాయణ రోదిస్తూ వివరించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss