man commits with covid fear in ramanthapur
కరోన వచ్చి కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే కొంతమంది కరోనా సోకిందేమోనన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం బెంగుళూరు లో ఒక యువకుడు కరోనా వ్యాది తనకు సోకిందనే అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి ఘటనే హైదరాబాద్లోని రామంతాపూర్లో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. ఒక వ్యక్తికి కరోన వచ్చిందనే అనుమానంతో బాల్కనీ నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు .
వాసిరాజు కృష్ణమూర్తి(60) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి రామంతాపూర్లోని వీఎస్ అపార్ట్మెంట్లో(ప్లాట్ నంబర్ 303) నివాసం ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా అతనికి ఎసిడిటీ సమస్యతో భాధపడుతుండటంతో తరుచూ ఆయాసం వాస్తు ఉండేది. దాంతో తనకు కరోనా సోకిందేమోనని అనుమానం పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆ విషయం చెప్పగా వారు అతన్ని కింగ్ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.
అక్కడ డాక్టర్ కరోనా లక్షణాలు లేవని చెప్పడంతో అందరూ సంతోషంగా ఇంటికి వచ్చేసారు. అయినప్పటికీ వాసిరాజు ఆందోళన చెందుతుండటంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం గాంధీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాసిరాజు తమ బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.