ఈ రోజుల్లో ఏం కొనాలన్నా జనం ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ మీదే ఆధార పడుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులన్నిటినీ ఆన్ లైన్లో చక్కగా ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇంట్లో కావల్సిన చిన్న చిన్న సబ్బుల నుంచి పెద్ద పెద్ద టివి వరకు అన్నిటినీ ఆన్ లైన్లోనే తెప్పించుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు ఆన్ లైన్ షాపింగ్‌లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇలా ఒక వస్తువు ఆర్డర్ ఇచ్చి వేరే వస్తువు వచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. తాము ఏమి ఆర్డర్ చేశామో ఒక్కసారి చూసుకుంటారు. కానీ ఒక యువకుడికి మాత్రం ఇలా షాపింగ్ చేయగానే అతనికి షాక్ తగిలింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన సాయి అనే యువకుడు అమెజాన్‌లో షాపింగ్ చేశాడు. అయితే ఆన్ లైన్లో అతడు చదువుకునే బుక్స్ పెట్టుకోవడం కోసం ర్యాక్స్ కొన్నాడు. కానీ అతడికి ర్యాక్స్‌కు బదులు కండోమ్స్ ప్యాకేట్స్ డెలవరీ అయ్యాయి. దీంతో అవి చూసిన సాయి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ దెబ్బతో ఇంకెప్పుడూ నేను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టను అంటూ లబోదిబోమంటున్నాడు.
ఇవి కూడా చదవండి: