Tuesday, April 13, 2021

Latest Posts

400 రూపాయల కోసం స్నేహితుడిని హత్య

400 రూపాయల కోసం స్నేహితుడిని హత్య చేశాడో వ్యక్తి. 400 రూపాయిలు అప్పు తీసుకున్న వ్యక్తి  తిరిగివ్వలేదని స్నేహితుడ్ని దారుణంగా హత్య చేసాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం థానే జిల్లా, ఉల్హాస్‌నగర్‌కు చెందిన సోను, ఫాహిమ్‌ ఓ జీన్స్‌ తయారీ కంపెనీలో పని చేస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఫాహిమ్‌, సోను దగ్గర 400 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు తీర్చడానికి ఫాహిమ్‌ ఇష్టపడలేదు.

ఎంత బ్రతిమాలినా ఇచ్చేవాడు కాదు. దీంతో తరచుగా స్నేహితులిద్దరికీ గొడవలయ్యేవి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా గొడవైంది. ఈ గొడవలో సోను, ఫాహిమ్‌ను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలానే నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss