అక్కినేని నాగార్జున గారు తన ట్వీట్ ద్వార మే 22, మే 23 తేదీలను ఎప్పటికీ మరిచిపోలేను అని కింగ్ నాగార్జున గారు ట్వీట్ చేశారు.అయితే ఆయన ఈ రెండు తేదీలు ఎందుకు మరిచిపోలేరో కూడా ఆయన వివరణ ఇచ్చారు.దానికి కారణం మే 22న ‘అన్నమయ్య’, మే 23న ‘మనం’ చిత్రాలు విడుదల కావడం అని కింగ్ తెలిపారు. ఈ రెండు చిత్రాలు ఆయన కెరీర్ కు ఎంత ముఖ్యమైనవి అని, అందులో ముఖ్యంగా ‘మనం’ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం కాగా ఆ చిత్రంలో అక్కినేని గారి నవ్వులు ఇప్పటికీ కళ్లముందు కదులుతూనే ఉంటాయి. ఇక ‘అన్నమయ్య’ విషయానికి వస్తే ఈ చిత్రం నాగార్జునలోని మరో కోణాన్ని చూపించినా చిత్రం ఇది. సాక్షాత్తూ కళ్ల ముందు అన్నమయ్యే దిగివచ్చాడా అనేలా నాగార్జున తన అభినయంతో ఈ చిత్రంలో అందరిని మంత్రముగ్దిలిని చేశారు. అయితే ‘అన్నమయ్య, మనం’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విక్రమ్ కుమార్లకు కృతజ్ఞతలు’’ అని నాగార్జున తన ట్వీట్లో పేర్కొన్నారు.
Two dates I cannot forget may 22nd and may 23rd🙏Release dates of two Unforgettable classic movies #annamaya #manam 🙏@Ragavendraraoba #vikramkumar https://t.co/mQfXx0C78s pic.twitter.com/iBCm2dcwMy
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 22, 2020