manchu family shocking decision on coronavirus
ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారితో చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. ఈనేపధ్యంలో భారత దేశమంతా లాక్డౌన్ మూడు వారాల కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణకు అనేక రకాలుగా చర్యలను చేపడుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలను అందించడమే కాకుండా నైతికంగా తమ మద్దతు తెలియజేస్తున్నారు.
టాలీవుడ్ కరోనా ‘క్రైసిస్ ఛారిటీ మనకోసం’ అనే సంస్థను ఏర్పాటు చేసి పేద కార్మికులను ఆదుకునేందుకు సెలబ్రిటీలందరూ ముందుకొస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీల విరాళాలతో సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయని ఆ సంస్థ ప్రకటించింది. ఒక సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పినట్లుగా ‘మా రూటే సెపరేటు’ అనే డైలాగ్ కి అనుగుణంగా మంచు ఫ్యామిలీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ సంక్షోభంలో 8 గ్రామాలను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. మోహన్ బాబు తన పెద్దకుమారుడు మంచు విష్ణుతో కలిసి చంద్రగిరి నియోజక వర్గంలోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం ఆ 8 గ్రామాల బాధ్యత తమదేనని మంచు ఫామిలీ చెబుతోంది. దత్తత తీసుకున్న గ్రామాలకు ఇప్పటికే సహాయకార్యక్రమాలను వారు అందిస్తున్నారు. ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయలను, నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. అంతేకాదు, ప్రతి ఇంటికి మాస్క్లు, శానిటైజర్స్ ఇస్తూ.. కరోనా బారిన పడకుండా ఎలా ఉండాలో వివరిస్తున్నారట.