Sunday, June 13, 2021

Latest Posts

మంచు మనోజ్ బర్త్ డే

టాలీవుడ్ లోకి నటవారసులు ఎంట్రీలు, రీఎంట్రీలు అంతా చాలా కామన్. అదేమంత పట్టించువాల్సిన అవసరం లేదు. అలానే టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆ కుటుంబం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్‌తో పాటు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న సైతం వెండితెరపై తండ్రి నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తోంది.

మంచు మనోజ్ కుమార్ తెలుగు సిని నటుడు. మోహన్ బాబు కుటుంబం నుండి విష్ణు తరవాత తెలుగు సిని పరిశ్రమకు పరిచయం అయిన మనోజ్ చెన్నైలో జన్మించాడు. ప్రాధమిక విద్య అనంతరం సౌత్ ఈస్ట్రన్ ఓక్లహోమ స్టేట్  యునివర్సిటీ నుండి బి.ఏ లో పట్టభద్రుడయ్యాడు. చిన్ననాటి నుండి సినీవాతావరణంలో పెరిగిన మనోజ్ సహజంగానే సినిమాలమీద ఆసక్తిని పెంచుకున్నాడు. అదే విదంగా తండ్రి నటించిన సినిమాలలో బాల నటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. మేజర్ చంద్రకాంత్ సినిమాతో వెండి తెరఫై తోలిసారి కనిపించిన మనోజ్ ఆ తరవాత చేసిన పుణ్యభూమి నాదేశం సినిమాకు గాను ప్రశంసలు అందుకున్నాడు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టైల్ లో నటనకు సరికొత్త నిర్వచనం చెప్పిన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్ మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు. 2004లో విడుదలైన దొంగ దొంగది చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. అప్పటి నుండి ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో రాకింగ్ స్టార్ మంచు మనోజ్. తండ్రి తరహాలో ప్రయోగాలకు వెరవని నైజమే మనోజ్ ను తెలుగు చిత్రసీమలో హీరోగా నిలదొక్కుకునేలా చేసింది.

2004 లో దొంగ దొంగది చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మనోజ్ మంచి కమర్షియల్ విజయాన్ని చూడటానికి 2010 వరుకు ఆగావలసి వచ్చింది. దొంగ దొంగదితో నటనపరంగా మంచి మార్కులు వేయించుకున్న సినిమా ఎవరేజ్ గా నడవటం, ఆ తరవాత వచ్చిన శ్రీ, రాజు భాయి పరాజయం పాలవడంతో నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయడం మొదలు పెట్టాడు మనోజ్. ఆ క్రమంలో ప్రయోగాత్మక చిత్రం నేను మీకు తెలుసా చేసి ప్రేక్షకులను ఆకర్షించాడు.. కానీ సినిమా కధబలం సరిగా లేకపోవడంతో బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేయలేక పోయింది.

తొలి చిత్రం దొంగ దొంగది తర్వాత శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పాండవులు పాండవులు తుమ్మెద, కరెంట్ తీగ, శౌర్య, ఎటాక్, ఒక్కడు మిగిలాడు,గుంటూరోడు ఇలా ప్రతి చిత్రంలో విలక్షణమైన పాత్రను పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ బిందాస్ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. త్వరలో “అహం బ్రహ్మస్మి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త సబ్జెక్ట్ లతో సినిమాలు చేస్తూ ఈ తరం యంగ్ హీరోస్ లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు మే 20. ఇలాంటి పుట్టినరోజులను ఆయన మరిన్ని జరుపుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాం.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss