Saturday, May 15, 2021

Latest Posts

మనోజ్ విడాకులపై మంచు విష్ణు అలా అనేశాడేంటి

manchu vishnu comments on manchu manoj divorce:

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  కలెక్షన్  కింగ్  మోహన్ బాబుకి  మంచి పేరుంది. విలన్ గా, కేరక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా విలక్షణత చాటుకున్నాడు. ఇక ఆయన కుమారులు మంచు విష్ణు,మంచు మనోజ్ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా ఎందుకో కెరీర్ సరిగ్గా ముందుకు సాగడంలేదు. పైగా  ఈ మధ్య మంచు విష్ణు సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. మంచి సినిమాతోనే రావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే  ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేస్తున్నపుడే అవి పోతాయని తెలిసినా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. త్వరలోనే మోసగాళ్లు సినిమాతో పాటు భక్త కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .

ఇక   కొన్ని రోజులుగా మీడియాకు కూడా దూరంగానే ఉంటున్న  విష్ణు తాజాగా  యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ముఖ్యంగా తమ్ముడు మనోజ్ విడాకుల గురించి కూడా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  తన తమ్ముడు భార్యతో విడిపోతున్నాడని తెలిసినపుడు తామేం మాట్లాడలేదని, ఎందుకంటే  అది అతడి జీవితం కదా అన్నాడు. అయితే ఏదేమైనా కూడా తమ్ముడు విడాకులు తీసుకున్న తర్వాత, టేక్ యువర్ ఓన్ టైమ్ అని మాత్రమే చెప్పానని అని చెప్పాడు.

నిజానికి  మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కన్‌ఫ్యూజన్‌లోనో, డిప్రెషన్‌లోనే ఉంటారు. అలాంటి సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని విష్ణు చెబుతు న్నాడు.   ఆ ఉద్దేశ్యంతోనే మనోజ్‌కు అలా చెప్పానని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత మనోజ్ మళ్లీ మామూలు మనిషి కావడానికి కొన్ని రోజులు పట్టినా కూడా ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చేసాడని అన్నాడు. ఇక మీరు  ముగ్గురూ (విష్ణు,మనోజ్,లక్ష్మి) మోహన్ బాబుకు సరైన వారసులేనా అని అడగ్గా, కాలమే నిర్ణయిస్తుందన్నాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss