Tuesday, April 13, 2021

Latest Posts

మంచు ఇంట  విష్ణు కొత్త వంటకం 

Manchu Vishnu Made Special Dish For Family

మహమ్మారి  క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ప్రపంచంలోని సగ భాగం పైనే లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఇక మన దేశ‌మంత‌టా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. మే 3వరకూ పొడిగించడంతో అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ముఖ్యంగా ఈ టైమ్‌లో సినీ సెల‌బ్రిటీలంద‌రూ వారి కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా స‌మయాన్ని గ‌డ‌ప‌డ‌మే కాదు.. పాక శాస్త్రంలో త‌మ ప్రావీణ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

తాజాగా మంచు విష్ణు కొబ్ట‌రికాయ‌లోనే అన్నం, చికెన్ వండాడు. ఆ వీడియోను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన విష్ణు ‘‘కొబ్బరి కాయల లోపల కాల్చిన బియ్యం, చికెన్ వేసి కొత్తగా వండటానికి ప్రయత్నిస్తున్నాను. లాక్ డౌన్ పూర్తయ్యేలోపు నేను చాలా పేటెంట్లతో చెఫ్‌గా మారుతాను’’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. మంచు విష్ణు పోస్ట్ చేసిన వీడియోలో మోహన్‌బాబు, ల‌క్ష్మీ మంచు కూడా క‌న‌ప‌డ్డారు.

విష్ణు వండిన వంట‌కాన్ని వారు టేస్ట్ చేసి అద్భుతం అంటూ కితాబిచ్చారు. కాగా గత నెల లాక్ డౌన్ కి ముందు అమెరికా నుంచి మోహన్ బాబు దంపతులు, మంచు విష్ణు వచ్చారు. ఆతర్వాత రావాల్సిన విష్ణు భార్య,పిల్లలు విమానాలు ఆగిపోవడంతో అమెరికాలోనే ఉండిపోయారు. దీంతో భార్య పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తోందని ,ఈ విపత్కర పరిస్థితిలో కంటతడి పడుతూ అప్పట్లో ఓ వీడియో కూడా పంచుకున్నాడు విష్ణు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss